Pages

Thursday, January 21, 2010

హృదయ వేదన





హృదయాని తడిచి చుసిన ఎన్నో వెతలు

కన్నీటిని చుక్క కదిలించిన దాని వెనుక ఎన్నో కథలు

తీయ్యటి పలుకుల్లో ఎన్నో విషాదాలు

చిరునవ్వుల్లో దాగిన ఎన్నో గాయాలు

కన్నుల్లో
ఏదో తెలియని బెరుకు

మదిలో
ఎగిసే లావాను ఆపేదెలా

గాయాలకు కోతలకు స్వాంతన కలిగెదెల

ప్రకృతి





పచ్చటి రంగు అద్దుకొని సప్తవర్ణ సుశోబితమయావే

ఇంద్రధనస్సే కంఠహరమయానే

ఎన్నో వింతలతో అపరంజి వలె మెరుస్తూ

జీవకోటికి ఆయువు పోసి

నీకు గుండెకొత కోసి కన్నీటి గోస మిగల్చిన

నీ కడుపులోనే మానవాళిని దాచుకునవే ప్రకృతిమాత

నీకు
ఇదే మానవాళి కుసుమాంజలి

నా కవిత



నా
కవిత ఒక రంగవల్లిక

నా కవిత ఒక ఉజ్జ్వలజ్వాల

నా కవిత ఒక అభ్యూదయాగీతిక

నా కవిత ఒక సుమనోహారమాలిక

నా కవిత యువత ప్రేమలేఖ

నా కవిత నాలో రగిలే కోరిక

Sunday, January 3, 2010

గుండెకోత


ఈ విరహ వేదన తీరేనా

నా మనస్సును కమ్ముకున్న విషాదం తొలిగేనా

నువ్వు లేని నేను శూన్యమే

నువ్వు లేని నా జీవితం ఎడారిమయమే

వస్తూ వెలుగే తెచ్చి, వెళ్తూ చీకట్లు మిగిల్చావే

నువ్వు లేక మనసే విలవిల్లాడుతుందే

నీ అందెల సవ్వడి లేక నా ప్రాణం చిన్నబోయెనే

నాతో కలిసి ఏడడుగులు నడుస్తావని

నాలో సగం అవుతావనే ఆశను భగ్నం చేసి

నా కలలను కల్లలు చేసి

నన్ను ఎండిన మోడు చేసి ఎక్కడికి వెళ్ళావే నా ప్రేమ........

బంగారి



చిన్నారి నవ్వు వలె అందంగా మైమరపించే మోము,

భయంలో ఆనందం చవి చూసే అపరంజి

తీయ్యని మాటలతో వీనులవిందు చేసేదానా

ఆపన్నులకు
హస్తం అందించే ప్రేమమయి

నీతో
ఉన్నవారి సంతోషం అయ్యావే

అందంలో
కుందనపుబొమ్మ

చదువులో
విపంచివి


సాహస విహార ప్రేమికా

ఎన్నో ఆశల స్నేహ మాలికవే బంగారమా...

Friday, January 1, 2010

చేజారిన హృదయం


నా గుండెల్లో అలజడిరేపి

కొత్త రంగులలోకం చూపి

నేను ఎరుగని ఆప్యాయతను చూపి

నన్ను నన్ను ల మర్చి

నా జీవితంలో ఉషోదయం తెచ్చి

నన్ను ఒంటరిని చేసి వెళ్ళవా

నువ్వు లేని ప్రేమ నాకేల ఓ ప్రాణమా

నువ్వు లేని ఎడబాటే నాలో తడబాటే అయిందే